భద్రాచలం ఐటీడీఏ పిఓ రాహుల్ గారిని కలిసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
తేది :26/10/2024
భద్రాచలం మండలం
=====================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ గారిని కలిసి, మణుగూరు మండలం, అశ్వాపురం మండలం, గుండాల మండలం, బూర్గంపాడు మండలం లోని పలు సమస్యలను ఐటీడీఏ పిఓ రాహుల్ గారి దృష్టికి తీసుకువెళ్లిన పినపాక ఎమ్మెల్యే పాయం గారు.. మణుగూరు మండలంలోని తెలంగాణ ట్రైబల్స్ వెల్ఫేర్ ఆఫ్ గ్రేట్ రెసిడెన్షియల్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ హాస్టల్ నందు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని కాలేజీకి వెళ్లే రహదారికి స్ట్రీట్ లైట్స్ కల్పించాలని హాస్టల్లో పెండింగ్లో ఉన్న నూతన నిర్మాణాన్ని ప్రారంభించాలని, అశ్వాపురం మండలం లో పోడు భూమి రైతులకు త్రీ ఫేస్ కరెంటు మరియు మోటర్ సౌకర్యం కల్పించాలని. అశ్వాపురం మండలానికి చెందిన కలిబోయిన సందీప్ గారి ఆటో మొన్న కురిసిన అకాల వర్షాల కారణంగా వరదకు కొట్టుకుపోవడంతో ఐటీడీఏ ద్వారా వారికి ఆర్థిక సాయంగా 25వేల రూపాయల చెక్కు మరియు పెండింగ్ లో ఉన్న 8 మంది రైతులకు పొడి భూమి పట్టాలను ఎమ్మెల్యే పాయం గారి చేతుల మీదుగా అందజేశారు, గుండాల మండలంలో ROFR పట్టా భూములలో బోర్లు వేయించుకున్నారు ఈ పట్టా భూములలో రైతులకు త్రీ ఫేస్ కరెంటు సౌకర్యాన్ని కల్పించాలని మరియు బూర్గంపాడు మండలంలో శ్రీరాంపురం ST కాలనీ అంగన్వాడి సెంటర్ రోడ్డు వేయుటకు ఫారెస్ట్ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అని ఫారెస్ట్ అధికారులతో క్లియరెన్స్ ఇప్పించాలని ఐటీడీఏ పిఓ గారికి వినతి పత్రాన్ని అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు