ఏరియా హాస్పిటల్ మణుగూరు నందు బుధవారం కంటి వైద్య పరీక్షలు
ఉచిత కంటి ఆపరేషన్లు చేయించుకోవాలనుకునే వారి కోసం మణుగూరు ఏరియా హాస్పిటల్‌లో రేపు బుధవారం కంటి వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి. సెలెక్ట్ అయిన వారికి సికింద్రాబాద్‌లోని పుష్పగిరి కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తారు. ఆపరేషన్‌కు ఎంపికైన వారిని భద్రాచలం మారుతి నర్సింగ్ కాలేజ్ నుండి సికింద్రాబాద్ వరకు ఉచిత బస్సు అందుబాటులో ఉంటుంది.ఈ ప్రోగ్రామ్‌లో 15 విడతలుగా, ప్రతి ట్రిప్‌కి 40 మంది చొప్పున కంటి ఆపరేషన్ల కోసం పంపించనున్నారు. ఆపరేషన్ అవసరమున్నవారు రేపు హాస్పిటల్‌లో కంటి పరీక్షలు చేయించుకొని తమ పేరు నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాము.
వివరాల కోసం:
జి. సంజీవరావు, ఆప్తాల్మిక్ ఆఫీసర్