ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పట్రోలింగ్ లో గంజాయి పట్టివేత
సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎస్ఐ ప్రసాద్ మరియు తన సిబ్బంది పట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో, మణుగూరు రాజుపేట ప్రాంతంలోని గ్రౌండ్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఆయనను ప్రశ్నించగా పారిపోబోయాడు. వెంటనే పోలీసులు అతడిని పట్టుకుని విచారించగా అతని వద్ద 1.350 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, నిందితుడు తన పేరు షేక్ ఇసాక్ (24 సంవత్సరాలు), బీటీపీఎస్‌లో క్యాజువల్ లేబర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు. అతను రామానుజవరం ప్రాంతానికి చెందిన మణికుమార్ అనే వ్యక్తి వద్ద నుండి రెండు కేజీల గంజాయిని రూ. 35,000కి కొనుగోలు చేశాడని, దానిలో కొంత స్వయంగా వినియోగించినట్లు వెల్లడించాడు. గతంలో, ఈ వ్యక్తి ఫిబ్రవరిలో కూడా గంజాయి అమ్మకానికి సంబంధించి కేసు నమోదై రిమాండ్‌కు వెళ్ళి వచ్చినట్లు తెలియజేసారు.
స్వాధీనపరచుకున్న సొత్తు వివరాలు:
- గంజాయి: 1.350 కేజీలు
- వాహనం: KTM బైక్ (TG28A1407)
ప్రస్తుతం మణికుమార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం శోధన కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ సోదాలో ఎస్ఐ ప్రసాద్ తో పాటు కానిస్టేబుల్ రవీందర్, రామారావు, పుల్లం దాస్ మరియు వెంకన్న పాల్గొన్నారు.