మణుగూరు నుండి పంచారామాలకు ప్రత్యేక *బస్సులు ఏర్పాటు : మణుగూరు ఆర్టీసీ డిపో మేనేజర్ *శ్యాంసుందర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మణుగూరు డిపో నుండి కార్తీక మాసం సందర్భంగా పంచారామాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ శ్యాంసుందర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మణుగూరు సురక్ష బస్టాండ్ నుండి ప్రతి ఆదివారం అనగా ఈనెల 3.10.17.24. తేదీలలో రాత్రి 8 గంటలకు మరియు 9 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. పంచారామాలైన అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట పుణ్యక్షేత్రాలను సోమవారం దర్శించుకొని తిరిగి మణుగూరు చేరుకుంటుందన్నారు. భక్తుల సౌకర్యార్థం సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని పెద్దలకు 1860 రూపాయలు పిల్లలకు 960 రూపాయలుగా రాను పోను ప్రయాణానికిటికెట్ ధర నిర్ణయించడం జరిగిందన్నారు. అదేవిధంగా అన్నవరం వెళ్లే భక్తుల సౌకర్యార్థం డీలక్స్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పెద్దలకు 800 రూపాయలుపిల్లలకు 430 రూపాయలు టికెట్ గా ధర నిర్ణయించడం జరరిగిందన్నారు. తక్కువ రవాణా చార్జీతొ ఆర్టీసీ కల్పించిన ఈ సదా అవకాశాన్ని భక్తులు వినియోగించుకొని పుణ్యక్షేత్ర ల ను సందర్శించి దైవ కృపకు పాత్రులు కాగలరని సూచించారు పూర్తి వివరాలకు 9959225963 అనే ఫోన్ నెంబర్ ను అని సంప్రదించవచ్చునన్నారు✍🏿