కట్టవాగు పూడిక పనుల పూర్తి అవ్వడంతో  – రైతులకు అండగా నిలిచిన పినపాక ఎమ్మెల్యే పాయం  సేవలు

తేదీ: 09 నవంబర్ 2024, మణుగూరు మండలం

కట్టవాగు పూడిక పనుల పూర్తి అవ్వడంతో  – రైతులకు అండగా నిలిచిన పినపాక ఎమ్మెల్యే పాయం  సేవలు

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం నెరెళ్ల చెరువు ప్రాంత రైతులు కట్ట వాగులో సిల్ట్ పూడిక ఎక్కువగా ఉండడంతో సాగు చేసుకునే నీటికి కొరత ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయి అని పినపాక ఎమ్మెల్యే  పాయంకి  వినతులు అందించారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన పినపాక ఎమ్మెల్యే  పాయం  అధికారులకు కట్ట వాగు పూడిక పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ పనులు పూర్తయ్యాక, నెరెళ్ల చెరువు రైతులు తమ పంటలకు సరిపడిన నీటిని అందించుకోవడంతో పాటు సాగులో ఉన్న సమస్యల నుంచి విముక్తి పొందినందుకు ఎమ్మెల్యే పాయం గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రైతులు ఎమ్మెల్యే పాయం గారిని సన్మానించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచిపూడి బాబు , పాతూరి వెంకన్న , మరియు నెరెళ్ల చెరువు ప్రాంత రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *