మణుగూరు పట్టణ అభివృద్ధి కోసం క్రీడా మైదానం కల్పనకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవ

మణుగూరు పట్టణ అభివృద్ధి కోసం క్రీడా మైదానం కల్పనకు పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు  చొరవ

మణుగూరు పట్టణంలో పారిశ్రామిక ప్రగతికి తోడుగా క్రీడా మైదానం అభివృద్ధి విషయంలో మణుగూరు జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని వాకర్స్ అసోసియేషన్, విశ్రాంత ఉద్యోగులు, క్రీడాకారులు చేసిన విజ్ఞప్తికి పినపాక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు తక్షణం స్పందించారు. ఈ క్రీడా మైదానం అభివృద్ధికి 20 లక్షల రూపాయల నిధులను కేటాయిస్తూ పనులను వేగవంతంగా పూర్తిచేయడానికి సాయపడ్డారు. ఈ నిధులతో జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో మెరుగైన సదుపాయాలు, సురక్షిత మంచినీటి సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో స్థానిక వాకర్స్ అసోసియేషన్, రిటైర్డ్ ఉద్యోగులు మరియు క్రీడాకారులు హృదయపూర్వకంగా ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరునాకి నవీన్, పీసీసీ సభ్యులు చందా సంతోష్, సీనియర్ నాయకులు సామా శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు గాండ్ల సురేష్, బొజ్జా త్రిమూర్తులు, ఎ.ఎం చారి, మండల మైనారిటీ నాయకులు రహీం పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *