భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ జట్టు ఫుట్‌బాల్ పోటీలో ద్వితీయ స్థానం కైవసం
KTPS – VII స్టేజ్, పాల్వంచ వారు నిర్వహించిన TG జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ కబడ్డీ, ఫుట్‌బాల్ టోర్నమెంట్స్‌లో జెన్కోలోని వివిధ ప్రాజెక్టుల నుంచి జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్‌లో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ జట్టు ఫుట్‌బాల్ పోటీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచి ద్వితీయ స్థానం సాధించింది.ఈ సందర్భంలో బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న, సి.ఈ కార్యాలయంలో క్రీడాకారులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ, సంస్థ ఎల్లప్పుడూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని, వారికి అవసరమైన క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని, ఉద్యోగుల సంక్షేమం సంస్థకు ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగులు కూడా సంస్థ అభివృద్ధి కోసం క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో DE/Tech సత్యనారాయణ మూర్తి, స్పోర్ట్స్ సెక్రటరీ కల్తీ నర్సింహారావు, జట్టు సభ్యులు డి. రమేష్ (కెప్టెన్), పి. రవితేజ, యం. నాగేశ్వరరావు, ఆర్. మురళి, జి. విజయ్ రామ్, డి. సురేష్, డి. వెంకటేశ్వర్లు, జి. గని, జి. సంపత్ రెడ్డి, జి. నవీన్ రెడ్డి, పి. రవి కుమార్, సి.హెచ్. ప్రశాంత్, జట్టు మేనేజర్ బి. హేమ్లా, కోశాధికారి సి.హెచ్. సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.