కొత్తగూడెం లో యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరిన మంత్రి తుమ్మల

  • కొత్తగూడెం లో యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరిన మంత్రి తుమ్మల,  ఇప్పటికే ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్స్ గా అప్ గ్రేడ్  చేయాలని మంత్రి తుమ్మల విన్నపం సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎర్త్ సైన్సేస్ కి సంబంధించి అదనపు డిపార్ట్ మెంట్ల ఏర్పాటుకు వినతి,  అన్ని వసతులతో అనుకూలంగా కొత్తగూడెం జిల్లా కేంద్రం,

విమానాశ్రయం నేషనల్, గ్రీన్ ఫీల్డ్ హైవే లతో అభివృద్ధి దిశగా కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం లో ఇప్పటికే ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను ఆప్ గ్రేడ్ చేస్తూ, యూనివర్సిటీ అఫ్ ఎర్త్ సైన్సెస్ గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రిగారిని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావుగారు కోరడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ కొత్తగూడెంలో అనేక ఇండస్ట్రీయల్ కంపెనీలు ఉన్నాయని, సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉందని, అంతేకాకుండా టీఎస్ జెన్కో, నవ భారత్ వెంచర్స్, బయ్యారం మైన్స్, మైలారం కాపర్ మైన్స్, NMDC లాంటివి ఉన్నాయని తెలియజేస్తూ, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఇంతకుముందు స్కూల్ ఆఫ్ మైన్స్) ని ఆప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గా చేయాలని ముఖ్యమంత్రి ని కోరారు. కొత్తగూడెం ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జిల్లా కేంద్రంగా ఉందని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నేషనల్ హైవే లతో రవాణా వ్యవస్థకు అనువైన ప్రాంతంగా ఉందన్నారు. అన్ని వనరులు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్స్ గా అప్ గ్రేడ్ చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయన్నారు. అదేవిధంగా అప్ గ్రేడ్ చేసిన యూనివర్సిటీలో యూ.జి, మాస్టర్స్, పి.హెచ్.డి ప్రోగ్రాంలలో భూగర్భశాస్త్రం, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ లాంటి ప్రోగ్రాంలు అదనంగా చేర్చి, భూగర్భశాస్త్ర, ఖనిజశాస్త్రం, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, జియో కెమిస్ట్రీ, మరియు జియో ఫిజిక్స్ లలో ప్రత్యేక విద్య మరియు శిక్షణని అందించాలని కోరారు. ఈ విధంగా చేసినట్లయితే ఈ విషయాలలో భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అవుతుందని మంత్రిగారు పేర్కొన్నారు. అంతేకాకుండా యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ద్వారా విద్యార్థులకు ఎర్త్ సైన్స్ లో మంచి విద్యను అందించడంతో పాటు, ఆర్థికాభివృద్ధికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడంలో, ఇండస్ట్రీ మరియ విద్య రెండిటిని సమన్వయం చేసుకుంటూ విద్యను అభ్యసించడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రిగారు అన్నారు. దీనికి ముఖ్యమంత్రిగారు సానుకూలంగా స్పందిస్తు, మంత్రిగారు కోరిన విధంగా త్వరలోనే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గా మారుస్తూ, దానికి సంబంధించిన అదనపు డిపార్ట్ మెంట్లను కూడా చేర్చడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *